గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఎమ్మెల్సీ, శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉన్న దృష్ట్యా తనకు ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ప్రచారం పూర్తయ్యే వరకు తనకు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. ఈ మేరకు వీహెచ్.. డీజీపీకి లేఖ రాశారు.
'ప్రత్యర్థుల నుంచి నాకు ప్రమాదం ఉంది.. భద్రత కల్పించండి' - congress leader hanumantha rao requests for security
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉన్న దృష్ట్యా తనకు ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. ప్రచారం పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు.
భద్రత కల్పించాలని డీజీపీకి వీహెచ్ లేఖ
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా అన్ని జిల్లాలు. నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉందన్న వీహెచ్ ప్రచారంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతుంటాయని వ్యాఖ్యానించారు.