తెలంగాణ

telangana

ETV Bharat / state

కోవర్టు రాజకీయాలకు ఆద్యుడు కేసీఆర్: దామోదర రాజనర్సింహ

హుజూరాబాద్ ఉపఎన్నికపై స్థానిక నేతలతో పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ చర్చించారు. రాష్ట్రంలో సిద్ధాంతపరమైన రాజకీయాలు లేవని... అంతా కోవర్టు రాజకీయాలేనని ఆరోపించారు.

కోవర్టు రాజకీయాలకు ఆద్యుడు కేసీఆర్: దామోదర రాజనర్సింహ
కోవర్టు రాజకీయాలకు ఆద్యుడు కేసీఆర్: దామోదర రాజనర్సింహ

By

Published : Jul 17, 2021, 4:57 PM IST

హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేలా పనిచేయాలని స్థానిక నాయకులకు ఆ నియోజవర్గ ఇంఛార్జీలకు పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ సూచించారు. గాంధీభవన్‌లో హుజురాబాద్ స్థానిక నాయకులు, మండల ఇంఛార్జీలతో దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. ఆ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపైనా చర్చించినట్లు దామోదర రాజనర్సింహ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా వ్యక్తులపై ఆధారపడదని... వ్యక్తుల గురించి మాట్లాడదని స్పష్టం చేశారు. తెలంగాణలో సిద్దాంతపరమైన రాజకీయాలు లేవని.. అంతా కోవర్టు రాజకీయాలేనని ఆరోపించారు. కోవర్టు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని పేర్కొన్న ఆయన...కాంగ్రెస్‌లో కోవర్టులెవరున్నారో గుర్తించాల్సి ఉందన్నారు.

రాజకీయాల్లో కోవర్టిజం

ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో కోవర్టిజం ఉంది. దీని సృష్టికర్తయో కానీ ..లేక ఆద్యుడు ఎవరంటే కేసీఆరే. ఇది కాంగ్రెస్​ పార్టీ గమనిస్తూనే ఉంది. ఇలాంటి కోవర్టు రాజకీయాలను ప్రోత్సహించకూడదు. కోవర్టు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. ఇలాంటి సదుద్దేశంతోనే సమావేశం జరిగింది. -దామోదర రాజనర్సింహ, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్

కోవర్టు రాజకీయాలకు ఆద్యుడు కేసీఆర్: దామోదర రాజనర్సింహ

ఇదీ చదవండి:Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా'

ABOUT THE AUTHOR

...view details