గోషామహల్ నియోజకవర్గంలో చివరి క్షణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్ భాజపాలో చేరడంతో... గోషామహల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. విక్రమ్ ముఖ్య అనుచరుడు, గోషామహల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలె పురుషోత్తం గులాబీ గూటికి చేరారు. విక్రమ్ తీరుతో కాంగ్రెస్ నేతలు విస్తుపోతుండగా ... తెరాస పార్టీలో చేరేందుకు మరికొంతమంది ఆసక్తి చూపుతున్నారు.
వేడెక్కిన రాజకీయం: గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు - కాంగ్రెస్ లేటెస్ట్ అప్డేట్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చివరి క్షణంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్ భాజపాలో చేరడం కాంగ్రెస్ క్యాడర్ను కలవరపెడుతోంది. మరోవైపు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు తెరాస గూటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
![వేడెక్కిన రాజకీయం: గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు congress leader ale purushottam join in trs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9702631-835-9702631-1606633515896.jpg)
వేడెక్కిన రాజకీయం: గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు
తెరాస ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో ఆలె పురుషోత్తం తెరాసలో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, ప్రజాదరణ చూసి తమ పార్టీలో చేరుతున్నారని ఎంపీ బీబీపాటిల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం మరోసారి దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కోసం చురుగ్గా ఏర్పాట్లు