రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కిసాన్ కాంగ్రెస్ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని... సోయా విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆందోళనకు దిగారు.
ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు - ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం వార్తలు
ప్రగతి భవన్ము ముట్టడించేందుకు యత్నించిన కిసాన్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రగతిభవన్ వద్దకు చేరుకున్నారు. వీరిని అడ్డుకున్న పోలీసులు... ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.
ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు తరలివచ్చిన కిసాన్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు
ఇదీ చూడండి:ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం