Congress review meeting on jodo yatra: అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అదానీ కంపెనీలకు లాభం చేకూర్చి.. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ది చేకూర్చారని ఉత్తమ్ ఆరోపించారు. గాంధీభవన్ ప్రాంగణంలోని ప్రకాశం హాల్లో హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే, జోడో యాత్ర ఇంఛార్జీ గిరీష్ చోడెంకర్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాల తీరుపై సమీక్షించారు. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలని కోరుకుంటుందని.. బీజేపీ మాత్రం దేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ది పొందుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.
''అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అదానీ కంపెనీలకు లాభం చేకూర్చి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ది చేకూర్చారు. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ బీజేపీ మాత్రం దేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ది పొందుతోంది.''-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ