తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవినీతిపై ప్రశ్నిస్తే ఇంటికి కరెంటు తీసేస్తారా' - mallu ravi

ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావుపై ఎంపీ రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యుత్​ ఉద్యోగుల నిరనపై కాంగ్రెస్​ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేసిన అవినీతి ప్రశ్నిస్తే విద్యుత్​ శాఖ ఉద్యోగులు ధర్నాచేస్తారా అని పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్​ మల్లు రవి ప్రశ్నించారు.

'అవినీతిపై ప్రశ్నిస్తే ఇంటికి కరెంటు తీసేస్తారా'

By

Published : Aug 30, 2019, 5:31 PM IST

ప్రజాసమస్యలు పరిష్కరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం... విద్యుత్​ ఉద్యోగులతో సమ్మె చేయిస్తోందని కాంగ్రెస్​ పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్​ మల్లు రవి ఆరోపించారు. కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది కాబట్టే ప్రభుత్వం మిన్నుకుండిపోయిందని ధ్వజమెత్తారు. ఎలాంటి తప్పుచేయకపోతే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తాము వ్యక్తిగంతంగా ఎవ్వరినీ నిందించడం లేదని కేవలం అవినీతి జరిగిందనే ఆరోపిస్తున్నామన్నారు. దీనిలో ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​ రావు, విద్యుత్​ ఉద్యోగులు కలగజేసుకోవద్దని సూచించారు. విద్యుత్​ కొనుగోలులో అవినీతి జరిగిందని ప్రశ్నించి రేవంత్​ రెడ్డి ఇంటికి కరెంటు తీసేస్తామని ఉద్యోగులు హెచ్చరించడం బాధాకరమన్నారు.
ఇదీ చూడండి: 'ఎంపీ రేవంత్​ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details