తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ బీ ఫామ్​ నిలిపివేసిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట - Congress CPI Alliance in Telangana

Congress Holds b Forms For 3 Candidates in Telangana : రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్​ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ బీ-ఫామ్​ను ముగ్గురు అభ్యర్ధులకు పూర్తిగా నిలిపివేసింది. చేవెళ్ల, వనపర్తి, బోధ్‌ అభ్యర్ధులకు ఏఐసీసీ నుంచి స్పష్టత వచ్చిన తరువాత ఫోన్​ చేసి సమాచారం ఇస్తామని పార్టీ ఇంఛార్జి కార్యదర్శులు తెెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

Congress CPI Alliance Kothagudem Ticket
Congress Stopped B Forms in Telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 9:09 PM IST

Congress Holds B Forms For 3 Candidates in Telangana: తెలంగాణలో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్ధి భీం భరత్‌తో పాటు వనపర్తి అభ్యర్ధి చిన్నారెడ్డి, బోధ్‌ అభ్యర్ధి వెన్నెల అశోక్‌లకు చెందిన బీఫామ్‌లు కాంగ్రెస్‌(Congress) పార్టీ పూర్తిగా నిలిపి వేసింది. ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీ తెలంగాణలో 100 మంది అభ్యర్ధులతో జాబితా విడుదల చేయగా.. అందులో 97 మందికి బీ ఫామ్​లను సిద్ధం చేసింది. అందులో 60 మంది అభ్యర్ధులకు అందజేసింది. ఇవాళ మధ్యాహ్నం చేవెళ్ల అభ్యర్ధి భీం భరత్‌ బీఫామ్ కోసం గాంధీభవన్‌ వచ్చారు. ఏఐసీసీ, పీసీసీలతో మాట్లాడిన తరువాత.. ఇస్తామని అక్కడ బీఫామ్‌లను ఇస్తున్న ఇంఛార్జి కార్యదర్శులు వెల్లడించారు. గాంధీభవన్‌లో గంటకుపైగా వేచి ఉన్నప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో ఇంఛార్జి కార్యదర్శులు జోక్యం చేసుకుని ఏఐసీసీ నుంచి స్పష్టత వచ్చిన తరువాత ఫోన్‌ చేసి సమాచారం ఇస్తామని చెప్పడంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.

గాంధీభవన్​లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్​ల అందజేత

Congress Stopped B Forms in Telangana : భీం భరత్‌పై ఫిర్యాదులు రావడంతో బీ ఫాం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వచ్చిన ఫిర్యాదులపై పరిశీలన చేస్తున్న కాంగ్రెస్‌.. ఏఐసీసీ తాత్కాలికంగా బీఫాం నిలుపుదల(Congress Stopped B Forms) చేసింది. ఇక్కడ షాబాద్‌ దర్శన్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. చేవెళ్ల ప్రస్తుత అభ్యర్ధికి బీఫామ్‌ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్న కాంగ్రెస్‌ వర్గాలు ప్రత్యామ్నాయ అభ్యర్ధి కోసం అన్వేసిస్తున్నట్లు పేర్కొంటోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని టికెట్‌ కోసం పోటీపడి నిరాశకు గురైన షాబాద్‌ దర్శన్‌ తనకు టికెట్‌ ఇస్తారని భావిస్తున్నప్పటికీ అక్కడ బలమైన నాయకుడి కోసం అన్వేశిస్తున్నట్లు తెలుస్తోంది.

సీపీఐతో కుదిరిన పొత్తు, కొత్తగూడెం సీటు కేటాయించిన కాంగ్రెస్

Congress CPI Alliance Kothagudem Ticket : రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నందున కాంగ్రెస్​ మిగిలిన 19 నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల జాబితా విడుదలకు సన్నద్దం అవుతుంది. ఈ క్రమంలో సీపీఐతో కాంగ్రెస్​ పొత్తు(Congress CPI Alliance) విషయంలో స్పష్టత ఇచ్చింది. సీపీఐతో పొత్తు ఉంటుందని.. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి తెలిపారు. ఆ నియోజకవర్గంలో సీపీఐ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇరు పార్టీల కోసం సమన్వయం కోసం కమిటీ వేస్తామని పేర్కొన్నారు. జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్​కు సహకరించాలని సీపీఐని రేవంత్​ కోరారు.

కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఘర్షణ - పరస్పరం కార్యకర్తల దాడి

ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

ABOUT THE AUTHOR

...view details