Congress Focus on Govt Lands Alienation : కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పలు దఫాలు సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ భూములు చేతులు మారుతున్నాయంటూ వారు ఎన్నికలకు ముందే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ఆదేశించడంతో పాటు, ఇతర రెవెన్యూ అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.
89 లావాదేవీలు చేసిన ఓ జిల్లా అధికారి : హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో ప్రభుత్వ భూములు చేతులు మారడం, ఏదో ఒక ఉత్తర్వును ఆధారంగా చేసుకొని అధికారుల సహకారంతో వారి పేరుతో ఆన్‌లైన్ చేయించుకోవడం జరిగినట్లు రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ధరణిలో (Dharani Portal in Telangana) జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్న క్రమంలోనే ఓ జిల్లా అధికారి 89 లావాదేవీలను ఆన్‌లైన్ చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
Dharani Problems: ధరణి లోపాలు.. రైతులకు శాపాలు
Congress Government Focus on Dharani Portal :ధరణి పోర్టల్ డిజైన్‌తోపాటు, నిర్వహణనూ ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో అక్రమ పద్దతుల్లో సిబ్బంది ఎక్కువ లావాదేవీలు చేశారని, అందుకే ఇలా జరిగిందని ఉన్నతాధికారులకు ఆ అధికారి నివేదించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం అక్రమాలు జరిగినట్లుగా భావిస్తున్న సర్వే నంబర్లును ఇందులో ఉండటంతో తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
ఇలాంటి వాటి వివరాలన్నీ వెలుగులోకి రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రికార్డుల్లో వచ్చిన తప్పుల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వీటిపైన కూడా ప్రభుత్వం వీలైనంత త్వరగా దృష్టి పెట్టాలనే అభిప్రాయాన్ని భూ వ్యవహారాల నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.