తెలంగాణ

telangana

ETV Bharat / state

గాయం ఎక్కడ ఉంది?... మందెక్కడ పెడుతున్నారు? - BJP 20 Lakes Crore Package

వివిధ రంగాలకు ఊరట కల్పిస్తూ కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కేవలం ఒక మాయ మాత్రమేనని కాంగ్రెస్ విమర్శించింది. తెలివైన మాటలతో ప్రజలను మాయ చేస్తూ భాాజపా సర్కార్ బోల్తా కొట్టిస్తోందని మండిపడింది.

Congress fires on BJP 20 Lakes Package
గాయం ఏడున్నది?... మందు ఎక్కడ పెడుతున్నారు...?

By

Published : May 16, 2020, 11:47 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటం వల్ల ఆశలు చిగురించిన వలస కార్మికుల్లో ఆర్థిక మంత్రి మాటలు నిరాశ పరిచాయని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ ఆరోపించారు. నిర్మల సీతారామన్ మాట్లాడిన తరువాత వలసకార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయారని పేర్కొన్నారు.

వలస కార్మికుల పట్ల కేంద్రం ఘోరంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వలస కార్మికుల విషయంలో గాయం ఒక చోట ఉంటే మందు మరోచోట రాస్తోందని ఎద్దేవా చేశారు. వారి కోసం ప్రకటించిన 11వేల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details