బల్దియా ఎన్నికల బరిలో నిలిపేందుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటి వరకు తుదినిర్ణయం తీసుకోలేదు. బుధవారం 45 మంది పేర్లతో కూడిన రెండు జాబితాలు విడుదల చేసిన హస్తం పార్టీ.. ఇవాళ మూడో జాబితా కింద రెండు, నాలుగో జాబితాలో 16 పేర్లు, ఐదో జాబితాలో 18 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లలో 81 మంది అభ్యర్థులను ఇప్పటి వరకు ప్రకటించింది.
నాలుగో జాబితాలోని అభ్యర్థులు
- మల్లాపూర్- దివాకర్‌రెడ్డి
- నాచారం- జ్యోతి మల్లికార్జున్ గౌడ్
- హబ్సిగూడ- బి.ఉమారెడ్డి
- రామంతాపూర్- టి.సౌమ్య
- బీఎన్‌రెడ్డి నగర్ - ఎం.సదాశివుడు
- వనస్థలిపురం- సామ రామ్మోహన్‌రెడ్డి
- చంపాపేట- రాఘవాచారి
- లింగోజీగూడ- రాజశేఖర్‌రెడ్డి
- కేపీహెచ్‌బీ కాలనీ - గంధం రాజు
- జగద్గిరిగుట్ట – గూడ వరమ్మ
- చింతల్- హృదయ స్నేహ
- సుభాష్‌నగర్- శ్రావణి
- కుత్బుల్లాపూర్- రాధ
- మచ్చబొల్లారం- యాదగిరి
- ఆల్వాల్- అనురాధ రెడ్డి
- వెంకటాపురం- సంజీవ్ కుమార్