రాష్ట్రంలో తెరాస రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. ఇంటర్ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హైదరాబాద్లో అన్నారు. 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆడుకుంటోందని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థను రద్దు చేసి... తప్పులకు కారణమైన అధికారులను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
'ఇంటర్ తప్పులకు కారణమైన అధికారులను తొలగించాలి' - మల్రెడ్డి రంగారెడ్డి
ఇంటర్ ఫలితాల వ్యవహారంలో తప్పులకు కారణమైన ఉన్నతాధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల కోసం పోరాటం చేస్తోన్న తమను గృహ నిర్బంధం చేయడం కేసీఆర్ రాచరిక పాలనకు నిదర్శనమని విమర్శించారు.
మల్రెడ్డి రంగారెడ్డి