తెలంగాణ

telangana

ETV Bharat / state

'దుబ్బాక ఉపఎన్నికలో నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించండి' - hyderabad latest news

దుబ్బాక ఉపఎన్నికలో నిబంధనల అమలు ఉల్లంఘనలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కాంగ్రెస్ ఎన్నికల కన్వీనర్ జి.నిరంజన్ కోరారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు.

'దుబ్బాక ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించండి'
'దుబ్బాక ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించండి'

By

Published : Oct 29, 2020, 8:08 AM IST

దుబ్బాక ఉపఎన్నికలో నిబంధనల ఉల్లంఘన విషయాన్ని కాంగ్రెస్​... కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు కాంగ్రెస్​ ఎన్నికల కన్వీనర్​ జి.నిరంజన్​ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఓటేసేందుకు బ్యాలెట్ విధానాన్ని అనుమతించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్ల వితరణ, ఏజెంట్ నియామకం వంటివి విధివిధానాల ప్రకారం జరిగేలా చూడాలని కోరారు.

దుబ్బాక నియోజకవర్గంలోని ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లు కేటాయిస్తోన్న టీం సభ్యులు రిటర్నింగ్ అధికారి సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దుబ్బాకలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆయన లేఖలో కోరారు.

ఇదీ చూడండి:విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్​

ABOUT THE AUTHOR

...view details