Congress Election Campaign in Telangana : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో.. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలతో పాటు అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రెండుమూడు రోజుల్లో తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రచారం.. తుది దశకు చేరుకోనుంది.
దీంతో ఈ నెల 15 తర్వాత.. తెలంగాణపై ఏఐసీసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం(Election Campaign in Telangana).. నేతల మధ్య అంతరాలు వంటి అంశాలపై ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులతో సమీక్షించారు.
బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయింపు
Revanth Reddy Election Campaign in Telangana: తెలంగాణలో ఎన్నికల వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని.. నేతలంతా ఐక్యంగా పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే ఇకపై జరిగేది అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రచారాన్ని మరింత సమర్థంగా నిర్వహించేలా ముందుకెళ్లాలని సూచించారు. ఈనెల 7 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిరాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం(Revanth Reddy Election Campaign 2023) చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే బీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను లక్ష్యంగా.. రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.