Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్ పార్టీ మొదట విడత అభ్యర్థుల జాబితా(T Congress MLA Candidate List)ను ప్రకటించిన తర్వాత.. ప్రచార సందడి మొదలైంది. అధికార బీఆర్ఎస్కు దీటుగా నేతలు.. జనంలోకి వెళ్లి ఆరు గ్యారెంటీలను వివరిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో.. త్వరలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో(T Congress Manifesto)ను విడుదల చేయనుంది. ఈ మేరకు కాంగ్రెస్‌లో సీనియర్, జూనియర్ ఐనా పార్టీకి నష్టం చేకూరిస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెగేసి చెప్పారు. తనను తిడితే పట్టించుకోనన్న రేవంత్.. పార్టీపై విమర్శలుచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Telangana Congress Six Guarantees Campaign : టికెట్.. రాని వాళ్ళకి.. బాధ ఉంటుందన్న ఆయన తమ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు. బీఆర్ఎస్కు బీజేపీ, ఎంఐఏంలు బీటీమ్ లాంటివని ధ్వజమెత్తారు. సీక్వెల్ ఈక్వెల్‌గా ఉండాలని కొంతమంది యోధులను.. రెండో జాబితాకోసం ఆపినట్లు తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం రోబోతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
"సోనియాగాంధీ సెప్టెంబరు 17న ఏదైతే ప్రకటన చేశారో..గ్యారెంటీల రూపంలో ఆ గ్యారెంటీలను అన్నింటినీ కూడా ప్రజలకు వివరించి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో.. అదే విధంగా డిసెంబరు 9 న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ఆరు గ్యారెంటీల మీద సంతకం పెట్టి.. 100 రోజుల్లో అమలు చేసే విధివిధానాలను పరిశీలించి.. విజయవంతం చేస్తాం. కాంగ్రెస్‌పై కేసీఆర్ చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు."- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు