Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. విద్యార్థి జేఏసీ నాయకులు.. రేవంత్‌రెడ్డి(TPCC President Revanth Reddy) సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. నారాయణపేట జడ్పీ ఛైర్‌పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ సహా పలువురు నేతలు పార్టీలో చేరారు . విస్తృతంగా జనంలోకి వెలుతున్న నాయకులు.. తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Telangana Congress Election Campaign 2023 :సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని హస్తం అభ్యర్థి.. గద్దర్ కుమార్తె వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలో పూజల హరికృష్ణ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పాల్గొన్నారు. రాష్ట్రంలో హస్తం పార్టీ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. మునుగోడులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య పాదయాత్ర చేపట్టారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో మైనంపల్లి రోహిత్‌రావు గడపగడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్ హస్తం 6 హామీలను క్షేత్రస్థాయిలో వివరిస్తూ ఓట్లడిగారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు ఊరురా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్‌లో మురళి నాయక్.. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలపై విమర్శలు గుప్పించి ఓట్లు అడిగారు.
Congress Leaders Election Campaign in Telangana 2023 :హనుమకొండ జిల్లా పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రచారంలో (Congress Election Campaign) జోరుపెంచారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధవరెడ్డి దుగొండి మండలంలోని ముద్దనూరులో ప్రచారం నిర్వహించారు. తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి.. కాంగ్రెస్‌ను గెలిపించి కానుకగా అందించాలని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ ప్రచారం చేపట్టారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం హస్తం పార్టీకే ఓటు వేయాలని తెలిపారు. ఆరు గ్యారంటీలను (Telangana Congress Six Guarantees) ప్రజలకు వివరిస్తూ ఓట్లడిగారు.