తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Election Campaign in Telangana 2023 : ప్రచార బరిలోకి దిగిన కాంగ్రెస్​ అభ్యర్థులు.. ఒక్క ఛాన్స్​ ఇవ్వాలంటూ ప్రజల్లోకి..

Congress Election Campaign in Telangana 2023 : రాష్ట్రంలో రెండో విడత అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో.. కాంగ్రెస్‌ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ఉత్సాహంగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ ప్రజలను కలుసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.

Congress Election Campaign in Telangana 2023
Congress Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 9:27 PM IST

Congress Election Campaign in Telangana 2023 :రెండో విడత ప్రకటనతో మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు.. కర్ణాటక మోడల్ కావాలా తెలంగాణ మోడల్ కావాలా నిర్ణయించుకోవాలని విసిరిన సవాల్​నుకాంగ్రెస్ నాయకులు వంశీ చంద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్​ రెడ్డి స్వీకరించి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకు వచ్చారు. ఓయూలో మాట్లాడుతూ.. ఉద్యమాల గడ్డ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి బస్ పెడతామని అదే బస్​లో మేడిగడ్డ , కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కర్ణాటకకి వెళ్దాం సిద్ధమా అని సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్​కు ఓయూకి వచ్చి విద్యార్థులను ఎదుర్కొనే దమ్ము ఉందా అని అన్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెపుతున్నారు. అదే నిజమైతే బహిరంగ చర్చకు రావాలన్నారు.

Madhu Yashki Goud Start Election Campaign :తొమ్మిదిన్నరేళ్ల రాక్షస పాలన అంతం కావడానికి సమయం ఆసన్నమైందని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీగౌడ్ అన్నారు. పార్టీ అధిష్ఠానం ఎల్బీనగర్ టికెట్‌ ప్రకటించడంతో అయన దిల్‌సుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్బీనగర్ కూడలిలో తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్​పై గెలిచి స్వలాభం కోసం అధికార పార్టీలో చేరిన సుధీర్​రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యమని మధుయాస్కీ పేర్కొన్నారు. సుధీర్​రెడ్డి నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ అధికార దాహంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ప్రజలు దీనిని గమనిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఎల్బీనగర్​లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ టికెట్ లభించని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరిని కలుపుకొని ముందుకు పోతానని స్పష్టం చేశారు.

Jaggareddy on Telangana Congress Manifesto : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం అమలు చేస్తామని, మరో కొద్ది రోజుల్లో మద్యం, డబ్బు ఏరులై పారుతోంది ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన వివిధ గ్రామాల బీఆర్​ఎస్ నాయకులు కాంగ్రెస్​లో చేరారు. ప్రజలు ఇక్కడ జగ్గారెడ్డికి గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేలా సహకారం అందించాలని కోరారు.

Telangana Congress MLA Candidates Second List : కీలక స్థానాలతో కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్టులో గద్దర్ కుమార్తె, అజహరుద్దీన్

Telangana Congress MLA Candidates 2023 : వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని శపథం చేశారు విశ్రాంత ఐపీఎస్ అధికారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు. అధిష్ఠానం వెలువరించిన రెండవ జాబితాలో తన పేరు రావడం తనకు ఆనందం కలిగించిందని అన్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని శపథం చేశారు. కేఆర్ నాగరాజుకుకాంగ్రెస్ టికెట్ కేటాయించడం పట్ల పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు సరైన నాయకుని కోసం ఎదురుచూసిన తమకు కేఆర్ నాగరాజు రూపంలో బలమైన నాయకుడిని అందించిన అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వొడితల ప్రణవ్‌ను ప్రకటించగా ఆయన ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రణవ్‌ పేరును ప్రకటించటంతో పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం హుజూరాబాద్‌లో ఆయన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్‌ను కలిశారు. వారితో మైదానంలో చక్కర్లు కొట్టారు. రానున్న సాధారణ ఎన్నికలో తనకు ఓటెయ్యాలని ఓటర్లను కోరారు. అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జమ్మకుంట రోడ్డు వైపులో ఉన్న ఓ హోటల్‌ వద్ద ఆగారు. అక్కడ స్థానికులతో టీ తాగారు. తన ప్రచారాన్ని నిర్వహించారు.

Ponnam Prabhakar Comments on CM KCR : సీపీఐకి హుస్నాబాద్ టికెట్ కేటాయిస్తే మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడనే భయం కార్యకర్తల్లో ఉండేదని, సీపీఐ సహకారంతోనే హుస్నాబాద్ టికెట్ కాంగ్రెస్ పార్టీకి ఖరారయిందని హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్ కలిసి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉదయమే మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశానని, ప్రవీణ్ రెడ్డి నిరాశ చెందవద్దని, భవిష్యత్​లో ఆయనకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనన్నారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో ఇక్కడ ఓటమి అనే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ మొఖం చూస్తే అర్థమైందన్నారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ప్రజలు వెనుతిరిగి వెళ్లడమే దానికి నిదర్శనమన్నారు.

Ticket Clashes in Telangana Congress : రెండో జాబితా తెచ్చిన తంటా.. కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి!

Telangana Congress MLA Tickets 2023 : కాంగ్రెస్ రెండో జాబితాలో రెడ్డి, బీసీలకు పెద్దపీట.. 10 మంది మహిళలకు ఛాన్స్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details