డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్న ఆయన.. అన్ని వర్గాల రక్షణ కోసం పోరాడుతున్న రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో 30లక్షలకు పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు నమోదు చేయాలని(T congress digital membership) కార్యకర్తలకు రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్ గాంధీభవన్(Revanth speech in gandhi bhavan) లో ప్రారంభమైన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సభ్యత్వం కేవలం ఐడీ కార్డు మాత్రమే కాదు: రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు పోటీనే కాదని రేవంత్(Revanth speech in gandhi bhavan) స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్(T congress digital membership) అని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐటీని అభివృద్ధి చేసి కంప్యూటర్, చరవాణిని మనకు పరిచయం చేశారని గుర్తు చేశారు.
డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన రేవంత్ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ సందేశాలు అందుకుని రాష్ట్రంలో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. పార్టీ సభ్యత్వం అంటే సాంకేతికంగా ఐడీ కార్డు ఇవ్వడం కాదు. వారిని కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా భావిస్తాం. వారికి రక్షణ కల్పిస్తాం. రాష్ట్రంలో ఎవరు పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. వారికి భరోసానిస్తూ రూ. 2లక్షల బీమా సదుపాయం ఇస్తున్నాం. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వం(T congress digital membership) తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లు రేవంత్ తెలిపారు. ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ(Revanth speech in gandhi bhavan) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపిన రేవంత్.. 14 నుంచి 21వరకు గ్రామాల్లో కాంగ్రెస్ జనజాగరణ యాత్రలు చేపడతామని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన నేతలపై రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఇదీ చదవండి:Farmer land issue : ఆ భూమి తనది కాదని రెవెన్యూ ఆఫీసుకెళ్లాడు.. అధికారులు ఏం చేశారో తెలుసా?