Congress Decided Not To Give Posts To Defeated Leaders :రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానం నుంచి సీపీఐ పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేసినా ఒకచోట మాత్రమే విజయం సాధించారు. 118 స్థానాల్లో 64 మంది మాత్రమే గెలుపొందగా మిగిలిన 55 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కైవసం చేసుకున్నాయి.
అయితే ఓటమి చెందిన 55 మంది నాయకులు ఏడాది పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ఏ పోస్టులనూ ఉండరాదని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు గాని ఈ 55 మందికి ఇవ్వకూడదని పేర్కొంది. అయితే మైనార్టీ ప్రజాప్రతినిధులు గెలవకపోవడంతో ఆ సామాజికవర్గంలో అర్హత కలిగిన నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తోంది.
Congress Decided Not To Give Posts To Defeated Leaders in Telangana :అదేవిధంగా ఇప్పటికిప్పుడు ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా వీరు అర్హులు కారు. 100కి పైగానామినేటెడ్ పదవులను (Nominated Posts) భర్తీ చేసే దిశలో హస్తం పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ఒకసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన ఏ నాయకుడికి తిరిగి ఏడాది వరకు ఇవ్వకూడదని, కొత్త వాళ్లను ప్రోత్సహించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఆ మూడు ఎమ్మెల్సీ పదవులను టికెట్లు త్యాగం చేసిన వారికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - 54 కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు