గాంధీభవన్‌లో ఇవాళ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హెచ్.కె.పాటిల్ అధ్యక్షతన ఈ సాయంత్రం దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది.ఈనెల 15వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నిర్వహించాల్సిన ఆందోళనలపై పాటిల్ రాష్ట్ర నేతలతో చర్చించారు. అధిష్ఠానం పిలుపునిస్తున్న కార్యక్రమాలు అయినందున తీవ్రంగా పరిగణించాలని పాటిల్ నేతలకు సూచించారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించాలని... 8వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేసేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షులు లేని జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు పీసీసీ కార్యవర్గ సభ్యులకు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలను, కార్యకర్తలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని పాటిల్ పార్టీ నేతలకు సూచించారు.
'క్షేత్ర స్థాయి నుంచి పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి'
గాంధీభవన్‌లో ఇవాళ పీసీసీ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. హెచ్.కె.పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీనియర్ నేతలు హాజరై పలు అంశాలపై చర్చించారు.
గాంధీభవన్‌లో పీసీసీ కోర్ కమిటీ సమావేశం
ఇవీ చూడండి: గులాంనబీ ఆజాద్ ఎదుటే కాంగ్రెస్ సీనియర్ల రగడ