Congress Complains EC Against BRS Government : శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎక్కువగా.. కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నాయి. ప్రముఖ ప్రాంతీయ, జాతీయ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు.. తమ అంచనాల్లో దాదాపు 80 శాతం హస్తం పార్టీదే అధికారమని తేల్చాయి. ఈ తరుణంలో ప్రస్తుత రాష్ట్ర సర్కార్ కార్యకలాపాలపై.. ఆ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతో.. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదేవిధంగా అసైన్డ్ భూములను ధరణిలో బినామీల పేర్ల మీదకు మార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka).. సీనియర్ నాయకులతో మంతనాలు జరిపారు. దీనిపై రాజ్యాంగ నిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పాలనా వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం పరిధిలో ఉండగా.. ప్రస్తుత ప్రభుత్వం విధానపర, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని.. హస్తం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైంది : కోదండరాం
Telangana Assembly Election Results 2023 : ఇదే అంశంపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ.. ఇవాళ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోకుండా నియంత్రించాలని ఈసీని కోరనున్నట్లు తెలిపారు.
"గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల అసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేయించేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3వతేదీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి భూములను ధరణిలో తప్పుగా నమోదు, రిజిస్ట్రేషన్‌లు చేసే అధికారులపై చర్యలు తప్పవు. ఇదే విషయమై ఈరోజు ఈసీకి ఫిర్యాదు చేస్తాం." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
Bhatti On CM KCR :రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమచేసే ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని భట్టి ఆక్షేపించారు. ఎన్నికల్లో భారాసకు వనరులు సమకూర్చిన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్న పాలకులు, రైతుబంధు సొమ్మును వారికి విడుదల చేయడానికి సిద్ధపడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించేలా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేయవద్దని ఆర్థికశాఖను హెచ్చరిస్తున్నామన్నారు. అధికార బదిలీ జరుగుతున్న క్రమంలో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిష న్‌ను కోరతామన్నారు. అధికారులు భారాస ఉచ్చులో పడొద్దని, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేయవద్దని హితవు పలికారు.