Revanth Reddy comments on free electricity for farmers : రాష్ట్రంలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తుడటంతో ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలపై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో 'పవర్ పాలిటిక్స్' అంశం తెర మీదకు వచ్చింది. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను అధికార బీఆర్ఎస్ పార్టీ అవకాశంగా మార్చుకొంటుంది.
రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరోసారి బయటపెట్టిందని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. కర్షకులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ ప్రకటించిన కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలోనూ రైతులకు విద్యుత్ ఇవ్వకుండా గోస పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఈ నేపథ్యంలో హస్తం నేతలు సైతం దీనిపై స్పందించారు.
Komatireddy Venkatareddy on free electricity for farmers : గ్రామాల్లో పది గంటల ఉచిత విద్యుత్ కూడా రావట్లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పేరుకే 24 గంటల ఉచిత విద్యుత్ కానీ.. కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ వృథా అవుతోందన్న కోమటిరెడ్డి.. ట్రాన్స్‌కో, జెన్కో అప్పులపాలయ్యాయని అన్నారు. తాము అధికారంలోకి వస్తేఉచిత విద్యుత్‌ఇవ్వటం పెద్ద లెక్క కాదన్న ఆయన.. రేవంత్‌రెడ్డి ఏ సందర్భంలో 8గంటల ఉచిత విద్యుత్ చాలని అన్నారో అడిగి తెలుసుకుంటానన్నారు.