Congress CM Oath Arrangements in Raj Bhavan :రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్ ముస్తాబవుతోంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం ప్రమాణస్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, షామియానా, సహా ఇతరత్రా సామాగ్రి తరలిస్తున్నారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ (GHMC) సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.
Arrangements For New CM Oath at Raj Bhavan :అటు కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసే ప్రక్రియ ఆలస్యం అయింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Telangana CEO Vikas Raj) గవర్నర్‌ను కలవడం మధ్యాహ్ననికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సీఈవో ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ను కలవాల్సి ఉంది. అయితే గెజిట్ జారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు దిల్లీ నుంచి ఈసీ సీనియర్ అధికారులు రావడం ఆలస్యమైంది.
తెలంగాణ ఎన్నికల్లో మూడు పార్టీల్లో గెలిచిన 'త్రిమూర్తులు'
కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంది. వీరితో కలిసి సీఈవో వికాస్ రాజ్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఎన్నికలకు సంబంధించిన నివేదిక ఇవ్వడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్‌ను అందించారు. దీంతో రెండో శాసనసభను గవర్నర్ రద్దు చేయడంతో పాటు, మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణస్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అవుతుంది.