Congress Case on Minister KTR: ఎన్నికల సమయంలో అధికార భవనాలను వాడుకుని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(Minister KTR)పై ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేపట్టింది. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌లోని టీహబ్‌లో యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని.. ఎన్నికల ప్రచారం కోసం టీహబ్‌ను వాడుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో (Telangana State Election CEO) ఫిర్యాదు చేసింది. అధికార హోదాను దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పాటు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేసింది.
నేను రష్మిక అంత ఫేమస్ కాదు - డీప్ ఫేక్ మహిళలకే కాదు, రాజకీయ నాయకులకూ ప్రమాదకరం : కేటీఆర్
KTR Goreti Venkanna Interview in Martyrs Memorial Complex: మరోవైపు అమరవీరుల స్మారకం ప్రాంగణంలో ఇటీవల కేటీఆర్, గోరెటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు(Case on KTR Goreti Venkanna Interview) చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెందిన భవనంలో ఇంటర్వ్యూ నిర్వహించారని.. కాంగ్రెస్ నాయకుడు నిరంజన్(Congress Leader Niranjan) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఓ వికాస్‌రాజ్(Vikash Raj) ఈ ఫిర్యాదును హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి పంపించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఈ ఫిర్యాదు చేరగా.. పరిశీలించారు. అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి సైఫాబాద్ పోలీసులకు సూచించారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తులో అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తించారు.