గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సాయంత్రంతో తెరపడడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. హిమాయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా రావు, కార్యకర్తలతో కలిసి బషీర్ బాగ్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. ప్రచారం ముగింపు దశకు చేరడంతో ఎన్నికల్లో గెలవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
గెలుపుకోసం ఆలయంలో అభ్యర్థుల పూజలు - జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం 2020
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరడంతో ఎన్నికల్లో గెలవాలని హిమాయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి బషీర్ బాగ్‌లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.
గెలుపుకోసం ఆలయంలో అభ్యర్థుల పూజలు
లిబర్టీలోని టీటీడీ దేవాలయం నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. హిమయత్ నగర్, నారాయణ గూడ, హైదర్ గూడ, తదితర ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగించారు.
ఇదీ చూడండి :'67 వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి కంటే బాగుండేది'