షేక్‌పేట డివిజన్‌లోని 20 పోలింగ్ కేంద్రాల్లో మజ్లిస్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి నిజాముద్దీన్ ఆరోపించారు. ఉదయం నుంచి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసి ఫిర్యాదు చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి దొంగ ఓట్లు వేయించారని పేర్కొన్నారు.
20 పోలింగ్ కేంద్రాల్లో మజ్లిస్ నేతలు రిగ్గింగ్ చేశారు: నిజాముద్దీన్
గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ రిగ్గింగ్‌కు పాల్పడిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. షేక్‌పేట డివిజన్‌లోని 20 పోలింగ్ కేంద్రాల్లో మజ్లిస్ నేతలు రిగ్గింగ్ చేశారని... కమిషనర్ పార్థసారథికి షేక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి నిజాముద్దీన్ ఫిర్యాదు చేశారు. మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Congress candidate Nizamuddin
తక్షణమే ఎస్‌ఈసీ స్పందించి 20 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్నారు. లేదంటే ఇప్పుడున్న కార్పొరేటర్‌కే పదవి పొడగింపు ఇవ్వాలన్నారు. మజ్లిస్ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఐదు సార్లు వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :బల్దియాలో పోలింగ్.. పార్టీల మధ్య ఫైటింగ్..