తెలంగాణ

telangana

ETV Bharat / state

రాంగోపాల్​పేటలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: శీలం ప్రభాకర్ - రాంగోపాల్ పేట్​ డివిజన్​లో కాంగ్రెస్​ ప్రచారం

తెరాస వైఫల్యాలే లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్​ ప్రచారం నిర్వహిస్తోంది. ప్రచారంలో భాగంగా రాంగోపాల్​ పేట డివిజన్​లో కాంగ్రెస్​ అభ్యర్థి శీలం కవిత ప్రచారం నిర్వహించారు. డివిజన్​లో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ఇప్పటి వరకు జరగలేదని ఆరోపించారు. ఎన్నికల్లో తనని గెలిపిస్తే ప్రజా శ్రేయస్సుకు పాటు పడతానని హామీ ఇచ్చారు.

congress candidate campaign in ramgopalpet
రాంగోపాల్​పేటలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: శీలం ప్రభాకర్

By

Published : Nov 24, 2020, 1:41 PM IST

తెరాస వైఫల్యాలను ఎండగడుతూ జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ దూసుకెళ్తోంది. ప్రచారంలో భాగంగా రాంగోపాల్ పేట్​ డివిజన్​లోని నల్లగుట్ట ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి శీలం కవిత పర్యటించారు. డివిజన్​లో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం పూర్తిగా ప్రజాశ్రేయస్సును మరిచిందని ఆరోపించారు.

రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ఇప్పటివరకు జరగలేదని, పేద ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలకు తాము ఏమి చేస్తామో చెబుతూ కాంగ్రెస్ వల్ల జరిగే అభివృద్ధిని, ఆవశ్యకతను తెలియపరుస్తున్నామని పేర్కొన్నారు. నాలా పూడికతీత విషయంలో తెరాస కార్పొరేటర్ విఫలమవడం వల్లే వరద నీరు ఇళ్లలోకి చేరిందని విమర్శించారు. గతంలో తాను కార్పొరేటర్​గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. ఇప్పటికీ అవే కనిపిస్తున్నాయి తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

రాంగోపాల్​పేటలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: శీలం ప్రభాకర్

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details