తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా వ్యతిరేక విధానాలే అస్త్రాలుగా గ్రేటర్​లో కాంగ్రెస్ ప్రచారం - కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. ప్రచారంలో దూసుకెళ్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనంలోకి వెళ్తోంది. తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలని సూచిస్తోంది.

ప్రజా వ్యతిరేక విధానాలే అస్త్రాలుగా గ్రేటర్​లో కాంగ్రెస్ ప్రచారం

By

Published : Nov 24, 2020, 9:43 PM IST

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్‌ పార్టీ... ప్రధాన అస్త్రాలుగా గ్రేటర్​లో ప్రచారం చేస్తోంది. అభ్యర్థులతో పాటు ఆయా డివిజన్ల, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వరదల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినా... అధికార పార్టీ పట్టించుకోలేదని, ముందు చూపు లేకపోవడం వల్లనే వరదలొచ్చాయని ఆరోపించారు.

జనంలోకి మేనిఫెస్టో...

తమకు ఓటేసి గెలిపిస్తే... ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇచ్చినట్లవుతుందని కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు వివరిస్తున్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌ పార్టీ నగరవాసులపై వరాల జల్లు కురిపించింది. పేద, మధ్య తరగతి ప్రజల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళుతున్నారు.

రేవంత్ ప్రచారం...

పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హయత్‌నగర్‌, మన్సూరాబాద్‌, రామంతపూర్‌, హబ్సిగూడ తదితర డివిజన్లల్లో పర్యటించి కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక సమస్యలను ఎత్తి చూపుతూ అధికార పార్టీ ఎందుకు పరిష్కరించడంలేదని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

అధికార పార్టీపై విమర్శలు...

వరద సహాయంలో రెండు, మూడు వేలు ఇచ్చి మిగిలిన మొత్తాలను తెరాస నాయకులు నొక్కేశారని ఆరోపించారు. సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వాళ్లను... ప్రజా సమస్యలను పట్టించుకునే వాళ్లనే గెలిపించాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెరాస, భాజపాపై విమర్శలు చేస్తూనే... స్థానిక అంశాలను ప్రస్తావించడం ద్వారా ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... నగరవాసిపై వరాల జల్లు

ABOUT THE AUTHOR

...view details