నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కేంద్రం అంతకంతకూ పెంచుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిచ్చింది. సోమవారం 6న రాష్ట్రంలో అడ్డగోలుగా విధించిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తామన్నారు. మండల విద్యుత్ కార్యాలయాల ఎదుట నల్ల జెండాలతో ధర్నా చేయనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. కాంగ్రెస్ క్యాడర్‌తో ఉత్తమ్ ఫేస్ బుక్ వేదికగా లైవ్‌లో మాట్లాడారు.
కేంద్రం దోచుకుంటోంది..
కొవిడ్ కష్టకాలంలో ప్రజలును కేంద్రం దోచుకుంటోందని ఉత్తమ్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలనూ అడ్డగోలుగా పెంచారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోయినా.. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్ల మేర పడిపోయినా.. పెట్రోల్ డీజిల్ ధర మాత్రం లీటర్ రూ.80కి ఏగబాకింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ఇష్టానుసారంగా ఎక్సైజ్ పన్ను, రోడ్డు సెస్ వేశారన్నారు. ఫలితంగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని వివరించారు.
వస్తువుపై ప్రభావం..