భారత్, చైనా సరిహద్దులో గల్వాన్ లోయలో అమరులైన కర్నల్ సంతోష్‌బాబుతో సహా 20మంది భారత సైనికులకు ఘనంగా నివాళులు అర్పించడం, వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాల పీసీసీలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. గల్వాన్ లోయలో అమరులైన భారత సైనికులకు ఈనెల 26న ఘనంగా నివాళులు అర్పించాలని, ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు "ఆమ్ దివాస్''ను పాటించి వారికి సంఘీభావం ప్రకటించాలని పార్టీ నాయకులకు తెలియజేశారు.
త్యాగాలను గుర్తిస్తూ...
'షాహీద్ స్మారక్' మహాత్మా గాంధీ ఇతర స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల వద్ద కూర్చోవాలని, కొవ్వొత్తులు వెలిగించి అమరులైన జవాన్లను స్మరించే ప్లకార్డులు, జాతీయ జెండాలను ప్రదర్శించాలని కేసీ వేణుగోపాల్ తెలిపారు. గంటపాటు ఎలాంటి నినాదాలు చేయకుండా సామాజిక దూరాన్ని పాటించి నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు. జవాన్ల త్యాగాన్ని గుర్తుచేస్తూ... సరిహద్దు రక్షించడంలో కేంద్రం వైఫల్యాలను ఎత్తి చూపాలని విజ్ఞప్తి చేశారు.
29న దేశవ్యాప్తంగా...