Congress Bus Yatra 2023 : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులు పాటు రాష్ట్ర పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలు ఉంటారని వివరించారు. రాహుల్, ప్రియాంకలు శివ భక్తులు అయినందున.. ఈ నెల 18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర ద్వారా ప్రచారం మొదలు పెడతారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy Announced Bus Yatra Schedule : అదే రోజు భూపాలపల్లిలో మహిళలతో సమావేశం ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లిలో పాదయాత్ర, సభ,.. కరీంనగర్‌లో పాదయాత్ర, సభ ఉంటుందని వివరించారు. 20న జగిత్యాల, బోధన్, నిజామాబాద్‌లో పాదయాత్ర, సభలు ఉంటాయని చెప్పారు రాష్ట్రంలో మూడు విడతలుగా బస్సు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర ఉంటుందని అన్నారు. దసరా తరువాత రెండో దశ, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడో దశ బస్సు యాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి తెలియజేశారు.
Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'
Revanth Reddy on Congress Tickets :అంతకుముందు రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) టికెట్ ఆశించి రాకపోతే ఎవరికైనా బాధగా ఉంటుందని తెలిపారు. పార్టీ నిర్ణయాలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. తనను తిడితే పట్టించుకోనని.. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. ఎవరైనా పార్టీకి, శ్రేణులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. హస్తం పార్టీఅధ్యక్షుడిగా మంచైనా, చెడైనా తానే భరించాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ నిర్ణయాలకు అనుగుణంగా పని చేస్తానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
Bhatti Vikramarka on Congress Manifesto 2023 : 'ప్రజల అజెండానే కాంగ్రెస్ మేనిఫెస్టో.. తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం'
Telangana Assembly Elections 2023 :గతంలో పొన్నాల లక్ష్మయ్య ఓడినా కూడా పార్టీ టికెట్ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. పొన్నాల పేరు అధిష్ఠానం పరిశీలనలో ఉందని.. తొందరపడి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ కోవర్టు లాగా పని చేస్తే ఊరుకోవాలా? అని అన్నారు. కాంగ్రెస్ పూర్తి మ్యానిఫెస్టో త్వరలోనే వస్తుందని స్పష్టం చేశారు. సీక్వెల్.. ఈక్వెల్‌గా ఉండాలని కొంతమంది యోధులను అపామని.. రెండో జాబితాలో షబ్బీర్అలీ, కొండా సురేఖ లాంటి వాళ్లుంటారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"టికెట్ ఆశించి రాకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. పార్టీ నిర్ణయాలు అర్థం చేసుకుని సహకరించాలి. నన్ను తిడితే పట్టించుకోను.. పార్టీపై విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోను. ఎవరైనా పార్టీకి, శ్రేణులకు నష్టం చేస్తే సహించేది లేదు. పార్టీ అధ్యక్షుడిగా మంచైనా, చెడైనా నేనే భరించాలి. ఏఐసీసీ నిర్ణయాలకు అనుగుణంగా పని చేస్తాను." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Reacts on BRS Manifesto : 'కాంగ్రెస్ ప్రకటించిన హామీలనే కేసీఆర్ కాపీ కొట్టారు'
Komatireddy Venkat Reddy on Congress MLA Tickets : 'టికెట్లు దక్కని నేతలు ఎన్నికల్లో సహకరించాలి'