తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Bus Yatra in Telangana 2023 : ఇలా ఎన్నికల షెడ్యూల్ రాగానే.. అలా బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్ - తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్లాన్

Congress Bus Yatra in Telangana 2023 : తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణమే బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ముఖ్యమైన నాయకులంతా బస్సు యాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండానే ఈ కార్యక్రమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రచారంలో రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులు కూడా భాగస్వామ్యం అయ్యేటట్లు కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తోంది.

Congress Bus Yatra in Telangana
Congress Bus Yatra

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 6:57 AM IST

Congress Bus Yatra in Telangana 2023 కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్లాన్.. అప్పటినుంచే షురూ

Congress Bus Yatra in Telangana 2023 :తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూలు(Telangana Assembly Election Schedule) విడుదల చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ఈనెల 6, 7 తేదీలలో షెడ్యూలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సమాయత్తం అవుతుంది. ఇప్పటికే యువ డిక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చేయూత పెన్షన్, 6 గ్యారంటీల కార్డు(Congress 6 Guarantees Card) విడుదల చేసిన కాంగ్రెస్.. వాటిని విస్తృతస్థాయిలో జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Telangana Congress Bus Yatra 2023 : మంగళవారం రోజున దాదాపు నాలుగు గంటల పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్ రావు ఠాక్రే , ముగ్గురు ఏఐసీసీ ఇన్​ఛార్జి కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు ఒక హోటల్​లో సమావేశమయ్యారు. బస్సు యాత్రతో పాటు ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగించాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

బస్సు యాత్ర(Congress Bus Yatra) ఎక్కడ నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి, దీని ద్వారా ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలకంటే మెరుగైన హామీలు ప్రకటించినట్లు చెబుతున్న కాంగ్రెస్.. ఏ విధంగా ప్రచారం చేస్తే అన్ని వర్గాల ప్రజల చెంతకు చొచ్చుకు వెళ్లొచ్చన్న అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం.

Congress Strategy Telangana Assembly Election : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్​ 'చతుర్ముఖ వ్యూహం'

Telangana Congress Plans Bus Yatra : ఇప్పటి వరకు ప్రకటించిన డిక్లరేషన్లు, 6 హామీల గ్యారంటీలు, చేయూత పెన్షన్‌లను ఇంటింటికి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన నేతలు చర్చించారు. బస్సు యాత్రలో రాష్ట్ర ముఖ్యులు, ఇతర నాయకులు భాగస్వామ్యమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా జాతీయస్థాయి నాయకులు పాల్గొనేటట్లు కూడా కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. బస్సు యాత్ర కాకుండా బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేటట్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Congress Six Guarantees in Telangana 2023 :గ్యారెంటీలకు సంబంధించి ప్రధానంగా కరపత్రాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా రాష్ట్ర మేనిఫెస్టో రూపకల్పన(Telangana Manifesto Formulation) పూర్తి చేసి జనంలోకి తీసుకెళ్లేందుకు చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు.. అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుంటూ, ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. వీటన్నింటిని క్రోడీకరించి సబ్బంద వర్గాలకు ఉపయోగపడేలా మేనిఫెస్టో తయారు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇతర ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాత బస్సు యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్‌ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్‌, షెడ్యూల్‌

Telangana Congress Disputes 2023 : కాంగ్రెస్​ పార్టీలో గందరగోళం.. చేరికలతో అయోమయంలో సీనియర్ నేతలు

ABOUT THE AUTHOR

...view details