Congress Booth Level Management Program at Hyderabad : హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఎల్‌డీఎం బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, సంపత్ కుమార్, జాతీయ నాయకులు శశికాంత్ సింథిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, హర్కర వేణుగోపాల్, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ఇందులో ప్రధానంగా బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. దీనిని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
- Revanth Reddy On Telangana Elections 2023 : 'డిసెంబర్ 9 నాటికి అధికారంలోకి.. విజయోత్సవ సభా ఇక్కడే'
- Rahul Gandhi Khammam Meeting Speech : 'కర్ణాటక తరహాలో.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం'
ఓటరు జాబితాలో అవకతవకలు..: పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని తెలిపారు. యాక్టివ్‌గా ఉన్న బూత్ ఎన్‌రోలర్స్‌ను బీఎల్ఏలుగా నియమించుకోవాలన్న ఆయన.. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12 వేల ఓట్లను తొలగించారన్నారు. ఒక్కో కుటుంబానికి 5 ఓట్లు ఉంటే 2 ఓట్లు డిలీట్ చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.