తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress and CPM Alliance in Telangana : కాంగ్రెస్​, సీపీఎం పొత్తు.. సీట్ల విషయంలో స్పష్టత వస్తేనే భేటీ - కాంగ్రెస్​ సీపీఐ కలిసాయా

Congress and CPM,CPI Alliance in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఎంకు పొత్తు విషయంలో చర్చించేందుకు ఆహ్వానం పంపింది. భేటీ విషయంలో సీపీఎం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తమకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత వస్తేనే భేటీ ఉంటుందని కమ్యూనిస్టు నేతలు చెబుతున్నారు. ఇవాళ సమావేశం ఉండకపోవచ్చని సీపీఎం వర్గాలు తెలిపాయి.

How Many Parties Alliance in Telangana for Assembly Elections
Which Party Allience with Congress in Telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 4:07 PM IST

Congress and CPM, CPI Alliance in Telangana Elections 2023 : ఎన్నికల పొత్తుపై చర్చించేందుకు రావాలని కాంగ్రెస్‌.. సీపీఎంకు ఆహ్వానం పంపింది. ఇవాళే పొత్తుల విషయంలో భేటీకి రావాలని ఆహ్వానించినా సీపీఎం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మర్యాదపూర్వక భేటీ కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ పాత్ర, లెప్ట్‌కు ఇచ్చే సీట్లపై స్పష్టత ఇవ్వాలని సీపీఎం కోరుతుంది. బీఆర్​ఎస్​తో ఎదురైనా పరిణామాల నేపథ్యంలో సీపీఎం అచితూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్పష్టతను పరిగణలోకి తీసుకుని.. భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మాత్రం కాంగ్రెస్ నేతలతో సమావేశం ఉండదని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం రోజున సీపీఐ నేతలతో కాంగ్రెస్ మధ్యవర్తులు చర్చలు జరిపారు. కమ్యూనిస్టు పార్టీలు కోరిన ఒకటి, రెండు సీట్లు మినహా మిగిలినవి ఇస్తే పొత్తుకు సరేననే సంకేతాలు వచ్చాయి. పొత్తులతో కాలయాపనతో మోసపోవద్దని సీపీఐ, సీపీఎం పార్టీలు భావిస్తున్నాయి.

Congress Leaders and CPI Leaders Meeting: ఆదివారం ఏఐసీసీ పంపిన దూతతో సీపీఐ(CPI) రాష్ట్ర నేతలు కూనంనేని సాంబ శివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్​ రెడ్డి సుమారు గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని కొత్త గూడెం, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, నల్గొండ జిల్లాలోని మునుగోడు, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్​ నియోజక వర్గాల అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్​ నేతలను వారి అనధికారకంగా కోరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో హుస్నాబాద్​, మునుగోడు అసెంబ్లీ స్థానాలని, ఓ ఎమ్మెల్సీను ఇచ్చేందుకు కాంగ్రెస్​ పార్టీ సుముఖత చూపుతోందని రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది.

సీపీఐ, సీపీఎం నేతల ఉమ్మడి సమావేశం.. దాని కోసమేనంట..!

Kunamneni Sambasiva Rao Speech on Alliance: ఆదివారం కాంగ్రెస్​ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై చర్చ జరిపిన విషయం వాస్తవమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు స్పష్టం చేశారు. వారు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ పోటీ అనే అంశంపై చర్చ జరపలేదని పేర్కొన్నారు. మరికొన్ని చర్చలు అనంతరం పొత్తు అంశం స్పష్టత ఉంటుందని అన్నారు. జాతీయ స్థాయిలో 'ఇండియా(INDIA)' కూటమితో వామపక్షాలు కలిసి పని చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య పొత్తు జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు తెలిపారు. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో కాంగ్రెస్​, సీపీఐ, ఇతర పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి. ఆయా ఎన్నికల్లో బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్​ అసెంబ్లీ స్థానాలను సీపీఐ పార్టీకి మహాకూటమి కేటాయించింది.

BRS Congress Debate on SC ST Declaration : ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్​పై రగడ.. ఆగని అధికార, విపక్షాల గలాట

MLA Balka Suman Controversy : 'కాంగ్రెస్ వాళ్లు మనవాళ్లే.. వారినేం అనొద్దు.. మనమే వాళ్లను పంపించాం'

'బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం'

ABOUT THE AUTHOR

...view details