తెలుగు సాహిత్యం, భాషాభివృద్ధికి.. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసులు చేస్తున్న కృషిని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. "తెలుగు సాహితీమూర్తుల ముఖచిత్రాలు - రేపటి తరం కోసం" పేరిట కాలమానిని ముద్రించారు. సాహితీవేత్తల జయంతులు, వర్ధంతులు విషయాన్ని శోధించే సమయంలో.. రామోజీ ఫౌండేషన్ ద్వారా ఈ అంశం ఉపరాష్ట్రపతి దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
venkaiah naidu: ఉపాధ్యాయుడికి.. ఉపరాష్ట్రపతి అభినందన లేఖ - ap news
ఏపీలోని కదిరికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసులును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. తెలుగు సాహిత్యం, భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి అభినందన తమలో నూతనోత్తేజాన్ని నింపిందని శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
venkayya naidu
సాహితీసేవలో శ్రీనివాసులుకు ఆయన సతీమణి యశోద, కుమారుడు షణ్ముఖ అందిస్తున్న సహకారాన్ని ఉపరాష్ట్రపతి లేఖలో ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి అభినందన తమలో నూతనోత్తేజాన్ని నింపిందని శ్రీనివాసులు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.