హిమచల్‌ప్రదేశ్ గరవర్నర్గా బండారు దత్తాత్రేయ నియామకం పట్ల తెలుగు రాష్ట్రాల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు, వ్యాపార వేత్తలు హైదరాబాద్ రాంనగర్‌లోని దత్తన్న నివాసంలో కలుసుకుని శుభకాంక్షలు చెప్పారు. ఆయనను కలిసిన వారిలో జానారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎంపీలు గరికపాటి రామ్మోహన్‌రావు, బండా ప్రకాష్, ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, భాజపా నేత వివేక్ వెంకటస్వామి ఉన్నారు.
దత్తన్నకు అభినందనల వెల్లువ... - dathathreya
భాజపా సినీయర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను హిమచల్‌ప్రదేశ్ గరవర్నర్గా నియమించడంపై తెలుగు రాష్ట్రాల నుంచి దత్తన్నకు అభినందనలు వెల్లువెత్తాయి. భాజపా నేతలతోపాటు అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు.
దత్తన్నతో జానారెడ్డి