ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. లాక్డౌన్తో ఇబ్బందుల్లో ఉన్న ఉపాధ్యాయలకు గురు దక్షణ పేరుతో ప్రభుత్వం తరఫున రూ.20 వేలు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలన్నారు.
ఉపాధ్యాయులను ఆదుకోండి.. కేసీఆర్‌కు వంశీచంద్ రెడ్డి లేఖ - hyderabad latest news
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లాక్డౌన్తో ఇబ్బందుల్లో ఉన్న ఉపాధ్యాయలకు గురు దక్షణ పేరుతో ప్రభుత్వం తరఫున రూ.20 వేలు అందించాలన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు వంశీచంద్ రెడ్డి లేఖ
కరోనా కష్టకాలంలో జీతాలు లేక పస్తులుంటున్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల గురువులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయుల కుటుంబాలకు భరోసానిచ్చే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పీఆర్సీ ప్రకటించి ఐఆర్ విడుదల చేయాలన్నారు. సీపీఎస్ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు.
ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్