2021-22 సంవత్సరం నుంచి బీటెక్‌లో నాలుగు, ఎంటెక్‌లో ఏడు కోర్సులు తీసుకురావాలని జేఎన్‌టీయూ ప్రతిపాదించింది. ఆయా కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సైతం అనుమతిచ్చింది. బీటెక్‌లో సీఎస్‌ఈ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- డేటాసైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్-మెషిన్‌లెర్నింగ్, మెకానికల్ విభాగంలో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉంది. కళాశాలలకు జేఎన్‌టీయూ అనుమతిచ్చింది. ఈ కోర్సుల పరిధిలో కొత్తగా 2,600 సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. అయితే.. కొత్త కోర్సులు, సీట్ల పెంపునకు గురువారం రాత్రి వరకు ప్రభుత్వం ఆమోదం ఇవ్వలేదు. శుక్రవారం వినాయకచవితి సెలవు. శనివారం నుంచే వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ షురూ కానుండటంతో అప్పటికల్లా సీట్లు అందుబాటులోకి వస్తాయా..? రావా..? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయాన్ని కళాశాల యాజమాన్యాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అందుబాటులోకి 157 కళాశాలలు..