తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ రాత్రి నుంచే గ్రూప్‌-4 దరఖాస్తుల స్వీకరణ..! - గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటన

Confusion in Group 4 Applications : తెలంగాణలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ మొదలు కాకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎలాంటి స్పష్టత, సమాచారం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Group 4 Applications
Group 4 Applications

By

Published : Dec 30, 2022, 10:56 PM IST

Confusion in Group 4 Applications : రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియపై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. డిసెంబరు 23 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొన్న పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. సాంకేతిక కారణాలతో దరఖాస్తుల స్వీకరణ తేదీని 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, ఇవాళ ఉదయం నుంచి గ్రూప్‌-4 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎక్కడా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన లింక్ కనిపించకపోవడంతో అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియపై ఇప్పటికీ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎలాంటి స్పష్టత, సమాచారం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వివిధ విభాగాల నుంచి పోస్టుల వివరాలు అందకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details