MLAs Poaching Case Update: తెలంగాణలో రాజకీయ వేడి సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసుల్లో గందరగోళం నెలకొంది. ఒకే నంబర్, ఒకే ఐఎంఈఐ నంబర్ ఉన్న ఫోన్ తేవాలని బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇద్దరికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న మొబైల్ నంబర్, అందుకు సంబంధించిన ఐఎంఈఐ నంబర్లు ఒకే విధంగా ఉండటంతో గందరగోళానికి దారి తీసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. గందరగోళంగా సిట్ నోటీసులు - Notices to BL Santosh in MLAs purchase case
11:03 November 19
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. గందరగోళంగా సిట్ నోటీసులు
నోటీసులు జారీ చేసే క్రమంలో కాపీ పేస్ట్ చేస్తుండగా పొరపాటు జరిగిందా.. లేదా దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నంబర్ ఎవరి దగ్గర ఉందో తేల్చుకోవడానికే అలా నోటీసులు పంపించారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్టు లక్ష్మీ జనార్దన సంతోష్‌కు సిట్ తాజాగా 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. రాకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి కాగా.. బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసు జారీ అయింది. విచారణకు వచ్చేటప్పుడు 94498-31415 నంబరు సిమ్‌తోపాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న కేరళ వైద్యుడు జగ్గుస్వామికీ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని సూచించారు.
ఇవీ చదవండి: