హైదరాబాద్ సాహెబ్ నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి సాహెబ్‌నగర్‌లోని ఓ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు.. లోపల ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన మరొక కార్మికుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఒక కార్మికుడి మృతదేహం లభ్యమవడంతో.... అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ఎల్బీనగర్ తెరాస ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెళ్లారు. ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించడంతో... కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది.