హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని చిక్కడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కమాన్ పరిసరాల్లో అర్చకులకు, కార్మికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉపాధి లేక అల్లాడుతున్న బ్రాహ్మణులకు సరుకులు పంచేందుకు వచ్చిన దాతలు వస్తువులు అందించకుండానే వెనుదిరిగారు. కుటుంబ పోషణకు మార్గం లేక దాతల కోసం అర్చకులు ఎదురు చూస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి వచ్చిన దాతలు వెనుదిరగటం వల్ల అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు మా పొట్ట కొట్టారు.. చర్యలు తీసుకోండి : అర్చకులు - శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులకు దానం చేయడానికి వచ్చిన దాతలకు కార్మికులకు ఘర్షణ చెలరేగింది. పౌరోహిత్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అర్చకులకు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వచ్చిన వారితో జరిగిన గలాటతో ఆ దాతలు వెనుదిరిగారు.
సరుకుల పంపిణీలో గలాట
పౌరోహిత్యం లేక అవస్థలు పడుతూ ఉండగా తమ కేంద్రం వద్దకు కార్మికులు వచ్చి తమ కడుపు కొడుతున్నారని అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్మికుల ఆగడాలపై చిక్కడపల్లి అర్చకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.