హైదరాబాద్ పాత బస్తీ పటేల్ నగర్లో బస్తీ దవాఖాన ప్రారంభం అనంతరం ఆ ప్రాంతంలో భాజపా, ఎమ్ఐఎమ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దవాఖాన పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రికి వ్యతిరేకంగా 'గో బ్యాక్' అంటూ భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
బస్తీ దవాఖానాను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ప్రారంభించి వెళ్లాక ఎమ్మెల్యే అక్కడకు వచ్చారు. నియోజక వర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, వరద బాధితులను ఆదుకోకుండా ఇప్పుడు ఎందుకొచ్చారని స్థానిక భాజపా నేతలు, కార్యకర్తలు.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.