జీహెచ్ఎంసీకి సంబంధించిన రోడ్డును కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడం ఖైరతాబాద్‌లోని నెహ్రూ నగర్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అప్పటి ప్రభుత్వం రాజీవ్ గృహ కల్ప పథకంలో భాగంగా ఇళ్లు కేటాయించిందని మంజుల అనే మహిళ తెలిపింది. ఆ ఇళ్లను కే ముత్యాలు, లలిత దంపతులు కబ్జా చేశారని ఆరోపించింది. గత 15 ఏళ్లుగా వారు తమ ఇంట్లో అక్రమంగా నివాసం ఉంటున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఇంటి వెనుక భాగంలో తలుపు ఏర్పాటు చేసి రోడ్డు కబ్జా చేసి మరో నూతన గదిని నిర్మించేందుకు యత్నించారని తెలిపింది. దీనిపై నిలదీసినందుకు తమపై దాడి చేయడం సహా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్డు కబ్జా చేయడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. పురపాలక, రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది.
జీహెచ్ఎంసీ రోడ్డు కబ్జాపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ - ghmc road occupation cases
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నెహ్రూ నగర్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన రోడ్డును కొందరు వ్యక్తులు కబ్జా చేయడం వివాదానికి దారి తీసింది. తమను బెదిరించి ఇల్లు ఆక్రమించుకున్నారని ఓ వర్గానికి చెందిన మంజుల అనే మహిళ ఆరోపించింది. జీహెచ్ఎంసీ రోడ్డును కబ్జా చేసి గదిని నిర్మించాలని చూస్తున్నారని పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఇరు వర్గాల ఘర్షణ
Last Updated : Sep 13, 2019, 12:08 AM IST