తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు వికీపీడియా సమాచార లభ్యతపై సదస్సు - ఐఐటి, హైదరాబాద్ ప్రాంగణంలో వికీపీడియా సదస్సు

రోజు రోజుకూ తెలుగు వికీపీడీయా చూసే వారి సంఖ్య పెరుగుతోందని, అందుకనుగుణంగా తెలుగు వికీపీడియా అందుబాటును పెంచాలని నిపుణలు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా ఐఐటి, హైదరాబాద్ ప్రాంగణంలో వికీపీడియా సదస్సును ఏర్పాటు చేసింది.

తెలుగు వికీపీడియా సమాచార లభ్యతపై సదస్సు

By

Published : Nov 17, 2019, 8:01 AM IST

ఐఐటి, హైదరాబాద్ ప్రాంగణంలో “వికీపీడియా సమాచార లభ్యత మరియు సముదాయ అభివృద్ధి” అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పెంచేందుకు సంఘటితంగా కృషి చేయాల్సిన అనవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఇందుకు “సముదాయ అభివృద్ధి”, “సమాచార లభ్యత”, “శిక్షణ అవగాహన”, “సాంకేతికత”, “పరిశోధన” అనే ఐదు విభాగాల కింద ఈ ప్రయత్నం జరగాలని నిపుణులు సూచించారు.

నాణ్యమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం ప్రజలు వికీపీడియాపై ఆధారపడతారని, అందుకే ప్రతీ సెకనుకు సుమారు ఎనిమిది వేల మంది వికీపీడియాను సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి అనేక రంగాలకు చెందిన సమాచారం తెలుగులో అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత అనేక పుస్తకాలను ప్రచురించిందని, వాటిని వికీపీడియాలో పొందుపరిచేందుకు అనుమతిచ్చామని భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుల శ్రీ మామిడి హరికృష్ణ తెలిపారు.

తెలుగు వికీపీడియా సమాచార లభ్యతపై సదస్సు

ఇదీ చూడండి : పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ను ఢీకొట్టారు...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details