తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​పై అవగాహన కోసం ఈనెల 23న సదస్సు - కరోనాపై ప్రజల్లో అవగాహన కోసం ఈనెల 23న సదస్సు

కొవిడ్​ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు ఈనెల 23న సదస్సును జరపనున్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్​దళ్ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఈ మేరకు ప్రకటించారు.

Conference on Awareness on Covid on 23rd of this month at kachiguda
కొవిడ్​పై అవగాహన కోసం ఈనెల 23న సదస్సు

By

Published : Aug 21, 2020, 8:55 PM IST

కొవిడ్​పై అవగాహన కోసం ఈనెల 23న సదస్సు

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు కాచిగూడలో ఈనెల 23న సదస్సును నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రీయ లోక్​దళ్ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ప్రకటించారు. ప్రజలకు మొదట కరోనా వ్యాధిపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి వైద్యులు వసంత కుమార్, శ్యాంసుందర్​లు కొవిడ్​ సూచనలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, తీన్మార్ మల్లన్న, ఇతర నేతలు పాల్గొంటారని చెప్పారు.

ఇదీ చూడండి :డియర్ ఆర్సీబీ.. కోహ్లీ ఎక్కడ?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details