తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరరాజాకు సీఐఐ పురస్కారం - భారత పరిశ్రమల సమాఖ్య

అమరరాజా సంస్థకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నుంచి అత్యంత శక్తి సామర్థ్య యూనిట్‌ (ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫీషియంట్‌ యూనిట్‌) పురస్కారం లభించింది. సీఐఐ నిర్వహించిన 22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంది.

CII Awards to Amararaja
అమరరాజాకు సీఐఐ పురస్కారం

By

Published : Aug 31, 2021, 10:30 AM IST

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నుంచి అత్యంత శక్తి సామర్థ్య యూనిట్‌ (ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫీషియంట్‌ యూనిట్‌) పురస్కారాన్ని అమరరాజా సంస్థ కైవసం చేసుకుంది. సీఐఐ నిర్వహించిన 22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంది.

ఈ నెల 24 నుంచి 27 వరకూ వర్చువల్‌ సమావేశం ద్వారా 30 మంది న్యాయ నిర్ణేతల పర్యవేక్షణలో పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 9 విభిన్న రంగాల నుంచి 400 పరిశ్రమలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నాయి. నిర్ణేతల ప్యానెల్‌ పరిశీలన అనంతరం ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలోని అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో ఉన్న ఆటోమోటివ్‌ యూనిట్‌కు ఇంజినీరింగ్‌ కేటగిరీ కింద పురస్కారం లభించింది. అదే విధంగా అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌లోని చిన్న బ్యాటరీల డివిజన్‌ ప్లాంట్‌ 'ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టు అవార్డు'ను గెలుచుకుంది.

న్యుమాటిక్‌ సిలిండర్‌ సైజ్‌ ఆఫ్టిమైజేషన్‌ చేయడం ద్వారా ఈ అవార్డును అందుకుంది. సీఐఐ నుంచి రెండు అవార్డులు లభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని సంస్థ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ సి.నరసింహులు నాయుడు పేర్కొన్నారు. ఇంధన సామర్థ్యం, పర్యావరణ పద్ధతుల లక్ష్యాలకు కట్టుబడి ఉండాలనే మా సంకల్పాన్ని ఈ పురస్కారాలు మరింత బలోపేతం చేశాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. ఇవాళ విచారణకు పూరి!

ABOUT THE AUTHOR

...view details