పెరిగిన పంట విస్తీర్ణం, మారిన స్వరూపానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఇంజినీర్లకు సాగునీటి నిర్వహణపై శిక్షణ ఇస్తామని నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. 2014లో రాష్ట్రంలో ఉన్న దాదాపు 24 లక్షల ఆయకట్టు ప్రస్తుతం 90 లక్షల ఎకరాలకు పెరిగిన నేపథ్యంలో నిర్వహణంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు వివరించారు. అత్యవసర సమయాల్లో పనుల మంజూరు విధివిధానాలపై కార్యశాలలో చర్చించినట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకాన్ని ఉపయోగించుకొని మూడేళ్లలో అన్ని చెరువులు, కాల్వల పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది రెండు వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
'పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా ఇంజినీర్లకు తర్ఫీదు ఇస్తాం' - రజత్‌కుమార్ తాజా వార్తలు
పెరిగిన ఆయకట్టు, మారిన స్వరూపానికి అనుగుణంగా క్షేత్రస్థాయి ఇంజినీర్లందరికీ సాగునీటి నిర్వహణపై శిక్షణ ఇస్తామని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై సీఈలు, ఎస్ఈలకు హైదరాబాద్‌లో కార్యశాల నిర్వహించారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు అనువుగా సాగుతున్నాయని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల డిజైన్‌లో లోపాలున్నాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో రెండో సొరంగానికి సంబంధించిన సివిల్ పనులు కూడా నడుస్తున్నాయని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. మిగులు ఉంటే జూరాల ఆయకట్టులోని పంటలకు చివర్లో నీరు ఇవ్వవచ్చని అన్నారు. వట్టెం జలాశయం నుంచి డిండికి నీరివ్వాలని దాదాపుగా నిర్ణయమైందని... ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కల్వకుర్తి కాల్వల సామర్థ్యాన్ని పెంచడం లేదని, పెరిగిన ఆయకట్టకు అనుగుణంగా నీరిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:'అత్యవసమైతేనే బయటకి రండి.. కరోనా వస్తే బెడ్లు దొరకవు'