మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా... హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్, తదితర కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవను నేతలు గుర్తుచేసుకున్నారు.
రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు - condolences to rajiv gandhi by congress leaders at somajiguda
హైదరాబాద్ సోమాజిగూడలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు.
రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
మనదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి రాజీవ్‌గాంధీయే కారణమని నేతలు కొనియాడారు. రాజీవ్ గాంధీ టెలికమ్యూనికేషన్ రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని నాయకులు ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ సమైక్యత కోసం తన ఆఖరి క్షణం వరకు పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అన్నారు.
ఇదీ చూడండి:పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు