గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో నేడు చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈనెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఆ ప్రసంగానికి ధన్యావాదాలు తెలుపుతూ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇవాళ శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ - Assembly sessions
ఇవాళ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ప్రసంగానికి ధన్యావాదాలు తెలుపుతూ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇవాళ శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తారు.
మరో విప్ గొంగిడి సునీత ఆ తీర్మానాన్ని బలపరుస్తారు. ఆ తర్వాత తీర్మానంపై చర్చలో అన్ని పక్షాలు పాల్గొంటాయి. చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్... సమాధానం ఇస్తారు. మండలిలో ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ దాన్ని బలపరుస్తారు. అనంతరం తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది.
చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తారు. ఇటీవల దివంగతులైన మాజీ ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, కమతం రామిరెడ్డిలకు మండలి సంతాపం ప్రకటిస్తుంది. ఈనెల 15న బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సభల ముందు ఉంచుతారు.