తెలంగాణ

telangana

ETV Bharat / state

పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ముగిసిన అభిప్రాయ సేకరణ - కాంగ్రెస్​ వార్తలు

గత నాలుగు రోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణ ముగిసింది. నేతల అభిప్రాయాల నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ కాంగ్రెస్​ అధిష్ఠానికి సమర్పించనున్నారు.

Concluding opinion poll on the election of the PCC President
పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ముగిసిన అభిప్రాయ సేకరణ

By

Published : Dec 12, 2020, 2:24 PM IST

పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ ముగిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో నాలుగురోజులుగా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

కాంగ్రెస్​ సీనియర్​ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు ఇలా అందరిని పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అడిగి తెలుసుకున్నారు. నేతల అభిప్రాయాల నివేదికను మాణికం ఠాగూర్ కాంగ్రెస్​ అధిష్ఠానికి సమర్పించనున్నారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకుని​ ఏఐసీసీ పెద్దలు తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడిని నియమించనున్నారు.

ఇదీ చదవండి:పేదల కోసం ఆరోగ్య పథకాలు తీసుకొచ్చాం: కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details